ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ts Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం - national sc commission serious on gandhi hospital incident news

తెలంగాణలోని హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్​ఐఆర్​ (FIR) నమోదు చేయకపోవడంపై ఆసహనం వ్యక్తం చేసింది. ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ మహేందర్​రెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి.. కమిషన్ వైస్‌ ఛైర్మన్ అరుణ్ హల్దార్ నోటీసులు జారీచేశారు.

ts Gandhi Hospital Rape Case
'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం

By

Published : Aug 18, 2021, 12:22 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రి ఘటనను ( Gandhi Hospital Rape Case ) జాతీయ ఎస్సీ కమిషన్ (national sc commission) తీవ్రంగా పరిగణించింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్​ఐఆర్​ (FIR) నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ మహేందర్​రెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి.. కమిషన్ వైస్‌ ఛైర్మన్ అరుణ్ హల్దార్ నోటీసులు జారీ చేసింది. ఘటనపై విచారణకు అరుణ్ హల్దార్ (arun halder) హైదరాబాద్‌ రానున్నారు.

గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) వారం రోజులపాటు అత్యాచారం చేశారని.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అనారోగ్యంతో ఉన్న రోగికి సహాయకులుగా వచ్చిన తమపై గాంధీలో టెక్నీషియన్‌గా పనిచేసే ఉద్యోగి.. గదిలో బంధించి అత్యాచారం చేశాడని.. అతనితోపాటు మరికొంత మంది సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి (Sunitha laxmareddy) గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఘటనకు సంబంధించి సూపరిండెంటెంట్‌ నుంచి వివరాలు సేకరించారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాంధీకి వెళ్లి.. ఘటనపై ఆరా తీశారు. గాంధీ ఆస్పత్రి ఘటనపై సమీక్షించిన హోంమంత్రి మహమూద్‌ అలీ.. బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

ఇదీ చదవండి:

ప్రేమ పేరుతో బాలికపై వేధింపులు.. ఆటో డ్రైవర్​పై కేసు

ABOUT THE AUTHOR

...view details