MURDER IN PALNADU : పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణ హత్య కలకలం రేపింది. నడిరోడ్డుపై ఓ ముస్లిం వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి అతికిరాతకంగా హత్య చేసి అనంతరం పారిపోయారు. వరవకట్టకు చెందిన షేక్ ఇబ్రాహీం (70), రహమత్ అలీ అనే ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు కాపు కాచి అరండలపేటలోని కర్ణాటక బ్యాంక్ సమీపంలో కత్తులతో దాడి చేసి.. దారుణంగా హత్య చేశారు. ఘటనలో గాయపడ్డ రహమత్ అలీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి.. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పల్నాడులో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు - Muslim brutally murder in narasaraopeta
TDP MUSLIM LEADER MURDER: నడిరోడ్డుపై ముస్లిం వ్యక్తిని దారుణ హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. వరవకట్టకు చెందిన షేక్ ఇబ్రహీం, రహమత్ అలీ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి ఇబ్రహీంను హత్య చేశారు.
ఇబ్రహీం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని అంజుమన్ కమిటీ మసీదు నిర్మాణంలో ఇబ్రహీం ఇటీవల కోర్టుకు వెళ్లిన వ్యవహారంలో వరవకట్టకు చెందిన కొందరు వ్యక్తులు, అదే విధంగా కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని గాయపడిన వ్యక్తి ఆరోపించారు. సమాచారం అందుకున్న నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, ఒకటో పట్టణ సీఐ అశోక్ కుమార్, పలువురు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: