Murder: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తన భార్య అమ్మమ్మ సామ్రాజ్యం(60)పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో.. ఆమె మృతి చెందింది. కొంతకాలం క్రితం సాయి అనే వ్యక్తి.. భవానీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యను మద్యం మత్తులో కొడుతుండటంతో ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి కక్ష పెంచుకున్న భర్త.. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి.. భార్య, పుట్టింటి కుటుంబీకులపై కత్తితో దాడికి యత్నించాడు. భయంతో అందరూ పారిపోగా.. వృద్ధురాలు అయిన సామ్రాజ్యంపై దాడి చేయగా ఆమె మరణించింది. అనంతరం రామవరపాడు కొత్త వంతెన సెంటర్లో కత్తితో హల్చల్ చేయడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కక్ష కట్టి భార్యపై దాడి చేయబోయాడు.. కానీ - crimes in vijayawada
Murder: మద్యం మత్తులో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే చంపాలనుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య అమ్మమ్మపై దాడి చేయగా.. ఆమె మృతి చెందింది. తరువాత రోడ్డుపైకి వచ్చి కత్తితో హల్చల్ చేయడంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.
హత్య