ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MURDER: ఫైనాన్స్​ రికవరీ ఏజెంట్​ దారుణ హత్య

MURDER: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి హత్య కలకలం సృష్టించింది. ఓ ఫైనాన్స్ సంస్థలో రికవరీ ఏజెంటుగా పనిచేస్తున్న రఘుపాత్రుని రాజశేఖర్(32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు.

MURDER
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వ్యక్తి హత్య

By

Published : May 17, 2022, 9:42 AM IST

MURDER: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి హత్య కలకలం సృష్టించింది. విశ్వవిద్యాలయంలోని విద్యా వసతిగృహం(విద్యా హాస్టల్) వెనుక ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రఘుపాత్రుని రాజశేఖర్(32) అనే వ్యక్తి ఓ ఫైనాన్స్ సంస్థలో రికవరీ ఏజెంటుగా చేస్తూ విశాఖ రైల్వే న్యూకాలనీలో నివసిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను కొందరితో కలిసి రాత్రి ఏయూలోకి వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మిత్రుల మధ్య వివాదం తలెత్తడంతో మాటామాటా పెరిగి శేఖర్​పై దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు భావిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

మృతదేహానికి సమీపంలోనే అతని పర్సు, సెల్​ఫోన్​ను గుర్తించిన పోలీసులు అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలంలో కొన్ని మద్యం సీసాలు ఉండడంతో ఆ మత్తులో గొడవపడి ఉంటారేమోనన్న కోణంలో విచారణ చేస్తున్నారు. భర్త హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకుని అతని భార్య కాంచన, తల్లి ఉమాదేవి, అతని కుటుంబ సభ్యులు ఏయూలోని ఘటనా స్థలానికి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన భర్తకు మద్యం తాగే అలవాటు లేదని మృతుడి భార్య పోలీసులకు తెలిపింది. రాజశేఖర్​కు ఓ వ్యక్తితో చిన్నపాటి వివాదం ఉందని.... ఈ హత్యలో అతని పాత్ర ఏమైనా ఉండొచ్చని ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details