ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

mother, son suicide: రైలు కింద పడి.. తల్లీకుమారుడు ఆత్మహత్య - ఒంగోలులో సూసైడ్​ వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం జరిగింది. రైలు కింద పడి తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నించిన పోలీసులకు ఘటనా స్థలిలో ఆధారాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

mother son suicide at railway track at prakasham district railway track
mother son suicide at railway track at prakasham district railway track

By

Published : Jul 24, 2021, 12:02 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 30 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ, 6 ఏళ్ల వయసున్న ఓ బాలుడి మృతదేహాలను ఈ తెల్లవారుజామున రైల్వే సిబ్బంది గుర్తించారు.

పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను గుర్తించేందుకు ఘటనా స్థలంలో ప్రయత్నించగా.. ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details