ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MOTHER KILLED KIDS: కడుపున పుట్టిన పిల్లల్ని గొంతు నులిమి చంపిన తల్లి - telangana varthalu

ఇద్దరు పిల్లలను తల్లే అతి దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగింది. పిల్లలను చంపిన తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కడుపున పుట్టిన పిల్లల్ని గొంతు నులిమి చంపిన తల్లి
కడుపున పుట్టిన పిల్లల్ని గొంతు నులిమి చంపిన తల్లి

By

Published : Aug 6, 2021, 8:24 PM IST

తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నతల్లే తన బిడ్డలను పొట్టనపెట్టుకుంది. పెంచి పోషించాల్సిన ఆ అమ్మే.. ఇద్దరి చిన్నారుల ప్రాణాలు తీసింది. ఊహ తెలియకముందే ప్రపంచానికే దూరం చేసింది. ఇద్దరు పిల్లలను తల్లే అతి గొంతు నులిమి హత్య చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసముండే జ్యోత్స్న.. తన ఇద్దరు పిల్లల గొంతునులిమి చంపేసిందని పోలీసులు తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. చిన్నారుల మృతదేహాలు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఆరేళ్ల దేవాన్ష్‌, నాలుగేళ్ల రుద్రాంష్‌గా గుర్తించారు. పిల్లలకు అనారోగ్యం కారణంగా తల్లి మనస్తాపం చెందిందని పోలీసులు చెబుతున్నారు. చాలా రోజులుగా మానసిక వేదనతో కుంగిపోతోందని.. మధ్యాహ్నం ఇద్దరు పిల్లలకు పారాసిటమాల్‌ వేసిందన్నారు.

మాత్రలు వేసిన తర్వాత గొంతు నులిమి చంపేసిందని.. ఆ తర్వాత సంగారెడ్డి శివారు మహబూబ్‌సాగర్‌ చెరువు వద్దకు వెళ్లిన జ్యోత్స్న.. చెరువులో దూకుతున్నట్లు భర్తకు వీడియో పంపింది. స్థానికులు సమాచారం ఇవ్వగా.. చెరువులో దూకిన జ్యోత్స్నను కాపాడామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Murder: కడప జిల్లాలో ఇద్దరు మహిళల దారుణ హత్య..పాతకక్షలేనా..!

ABOUT THE AUTHOR

...view details