కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటంచిందో ఓ అత్త. అందుకు కుమార్తె కూడా సహకరించింది. ఈ ఘటనలో కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన యువకుడు శనివారం రాత్రి మృతిచెందాడు. అడ్డగుట్ట పొచమ్మ దేవాలయం వద్ద నివసించే దండుగళ్ల నాని (28) కారు డ్రైవర్. తెలంగాణలోని మల్కాజిగిరి ఠాణా పరిధిలోని జేఎల్‌ఎన్‌ఎస్ నగర్‌లో నివసించే అనిత అలియాస్ సోని(26)తో 2015లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె హాసిని ఉంది. నానికి మద్యం అలవాటు ఉంది. తాగిన మైకంలో భార్యను వేధించేవాడు. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు అధికం అయ్యాయి.
TS CRIME NEWS: అల్లుడికి నిప్పంటించిన అత్త.. తల్లికి సహకరించిన కుమార్తె..! - తెలంగాణ వార్తలు
కూతురిని వేధిస్తున్నాడని ఆమె సాయంతో అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది ఆ అత్త. ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితుడు శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి నాలుగేళ్ల చిన్నారి ఉంది.
తొమ్మిది నెలల క్రితం మల్కాజిగిరి ఠాణాలో ఫిర్యాదు చేసిందని ఎస్సై యాదగిరి తెలిపారు. అప్పటినుంచి తల్లితో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 13న కుమార్తెను చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లుడు మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్ పార్వతమ్మ(45), కుమార్తెతో కలిసి అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాంధీలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిద్రిస్తున్న బాలికపై యాసిడ్ దాడి- ప్రేమే కారణమా?