ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CCTV Footage: అమ్మకు ఆయుష్షు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది! - అనంతపురంలో రోడ్డు ప్రమాదాలు

చిన్నారికి జలుబు చేసింది. అమ్మకు గుబులు పుట్టింది. బిడ్డకు ఊపిరాడటంలేదని.. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మందులు లేవని బిడ్డ ఏమైపోతుందోనన్న భయంతో అర్ధరాత్రి పరుగులు పెట్టింది. ఇంతలోనే కారు రూపంలో మృత్యువు వెంటాడింది. అమ్మకు ఆయుష్షు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. క్షణాల్లో వేగంగా దూసుకువచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

accident
accident

By

Published : Jul 24, 2021, 9:42 AM IST

Updated : Jul 25, 2021, 12:01 PM IST

సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు..

రెండేళ్ల చిన్నారికి జలుబు మందు తెచ్చేందుకు వెళ్లిన తల్లి ప్రమాదంలో మృత్యువాత పడింది. అనంత నగరానికి చెందిన యాస్మిన్‌(29), శ్రీనివాసనగర్‌కు చెందిన జగదీశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. చిన్నారికి జలుబు చేయడంతో గురువారం అర్ధరాత్రి సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. తల్లి నిద్ర లేచి చూసింది. భర్తను లేపి పాపకు మందు తీసుకురావాలని సూచించింది. ఉదయం ఆసుపత్రికి వెళ్దామని, అప్పటి వరకు ఇబ్బంది లేదని భర్త చెప్పాడు.

కొంత సేపటి తర్వాత చిన్నారిని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందైతే పాప ప్రాణానికే ప్రమాదమని ఆందోళన చెందింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో మందుల చీటీ పట్టుకొని తన స్కూటీపై దుకాణానికి బయల్దేరింది. చంద్ర ఆసుపత్రి కూడలి దాటగానే వెనుక వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది.

ఈ ప్రమాదంలో యాస్మిన్‌ అక్కడికక్కడే మృతిచెందింది. విషయాన్ని గమనించిన రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై జగదీశ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. యాస్మిన్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గస్తీ కానిస్టేబుల్‌ శివకుమార్‌ ప్రమాదానికి కారణమైన కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. క్షణాల్లో వేగంగా దూసుకువచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఇదీ చదవండి:

Olympics Live: హాకీలో భారత జట్టు శుభారంభం

Last Updated : Jul 25, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details