ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MOTHER DIED: 'నన్నొదిలి పోయావా బిడ్డా.. నీ వెంటే నేనూ' - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

MOTHER DIED: కడుపున పుట్టిన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే కన్నతల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది చేతికి అందివచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి? రక్తపు ముద్ద నుంచి మొదలు.. ప్రాణానికి జీవం పోసే వరకు నవమాసాలు మోసిన ఆ తల్లి.. కన్నకొడుకు దూరమైతే తట్టుకోగలదా? అందుకేనేమో కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లి కూడా తనువు చాలించింది. రైలు ప్రమాదంలో కొడుకు మరణిస్తే.. ఆ వార్త విని ఆ తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో జరిగింది.

MOTHER DIED
MOTHER DIED

By

Published : Jun 28, 2022, 12:25 PM IST

Mother died of a heart attack after son's death: కడుపున పుట్టిన కొడుకు కానరాని లోకాలకు పయనమయ్యాడని తెలుసుకున్న ఆ తల్లి తనువు చాలించింది. ఈ విషాద ఘటన వైఎస్సార్​ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో జరిగింది. కేవలం గంట వ్యవధిలోనే తల్లి, కుమారుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొత్త మాధవరానికి చెందిన బాలరాజు అనే యువకుడు.. మృకుందాశ్రమం సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఈ విషయాన్ని స్థానికులు అతని తల్లి సుబ్బనరసమ్మకు తెలియజేశారు. కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లి.. గుండెపోటుతో మృతి చెందింది. గంట వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతి చెందడంతో కొత్త మాధవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details