Five members suicide: నెల్లూరు జిల్లాలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకేరోజు ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. ఓ ఘటనలో తల్లి, కుమారుడు, కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. మరో ఘటనలో తండ్రి, కుమారుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకేరోజు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం కలకలం రేపింది.
నెల్లూరులో జిల్లాలో విషాదం.. రెండు వేర్వేరు ఘటనలో ఐదుగురు ఆత్మహత్య - five persons suicide in nellore
14:36 September 01
ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, బావిలో దూకి తండ్రి, కుమారుడు
Mother and childs suicide: వింజమూరు పట్టణంలోని జై భీమ్‌నగర్‌లో సాదం గీత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు వెంకట్ (10), చరిష్మా (5)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. గీత భర్త వెంకట్రావు సమీపంలోని గ్యాస్ గోడౌన్లో గుమస్తాగా పని చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఉండడాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Father and son suicide: ఇలాంటి ఘటనే నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు అంబాపురం ప్రాంతంలో జరిగింది. బావిలో దూకి తండ్రీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. అంబాపురానికి చెందిన రంగస్వామికి తన భార్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇద్దరు కొడుకులను తీసుకుని దగ్గరలోని నేల బావి దగ్గరికి వెళ్ళగా.. పెద్ద కుమారుడు తప్పించుకుని పారిపోయాడు. రామస్వామి, చిన్న కుమారుడు శివకుమార్ ఇద్దరూ బావిలో దూకారు. పెద్ద కుమారుడు ఈ సమాచారాన్ని స్థానికులకు తెలపగా.. వారు హుటాహుటిన బావి దగ్గరకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రంగస్వామి, శివకుమార్‌లు మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు
ఇవీ చదవండి:
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు