ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Selfie Suicide: నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

Selfie Suicide: తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లి వైద్యం కోసం ఈ నెల 11న లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Mother and son commit suicide by setting fire in kamareddy
నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య

By

Published : Apr 16, 2022, 10:29 AM IST

Selfie Suicide: తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడం లాడ్జి సిబ్బంది గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. మృతులు తల్లి పద్మ, కుమారుడు సంతోష్‌లను రామాయంపేట్‌ వాసులుగా గుర్తించారు. తల్లి వైద్యం కోసం ఈ నెల 11న లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఘటనాస్థలిని డీఎస్పీ సోమనాథం, సీఐ నరేష్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. వారి ఆత్మహత్యకు కారణం ఏడుగురున్నట్టుగా రాసిన సుసైడ్​ లేఖను పోలీసులు ఘటనాస్థలిలో స్వాధీనం చేస్తున్నారు. అదీ కాగా.. ఆత్మహత్యకు ముందు తల్లీకుమారుడు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోలో వారి వ్యథను వెల్లిబుచ్చారు. ఆత్మహత్య చేసుకోడానికి కారణమైన వారి గురించి, వారు తమ కుటుంబానికి చేసిన మోసాలు, పెట్టిన ఇబ్బందుల గురించి చెప్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.

"బాసం శ్రీనుతో కలిసి నేను వ్యాపారం చేశా. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరారు. ఇవ్వలేమని.. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నారు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. దీనిపై మరుసటి రోజే మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. 10 రోజులయ్యాక ఫేస్‌బుక్‌ అంశంలో సంబంధం లేదన్నారు. నా ఫోన్‌లో సమాచారాన్ని పోలీసులు జితేందర్‌గౌడ్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి జితేందర్‌గౌడ్ మనుషులు ఫోన్‌లోని సమాచారంతో ఇబ్బంది పెట్టారు. నన్ను బెదిరించే విషయాన్ని కూడా పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఏడాది పాటు జితేందర్ గౌడ్ మనుషులు నన్ను ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అర్థికంగా నష్టపోయాను. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయాను. వాళ్ల ఇబ్బందులు తట్టుకోలేకనే నేను, అమ్మ చనిపోతున్నాం." - వీడియోలో సంతోష్‌

నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details