ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Missing: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. భర్త వేధింపులే కారణమా? - mother and kids missing in Kadapa district

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన.. కడప జిల్లా దేవునికడప పరిధిలో జరిగింది. భర్త వేధింపులు భరించలేకే ఆ ఇల్లాలు పిల్లలతో కలిసి వెళ్లిపోయినట్టు గుర్తించిన పోలీసులు.. వారి ఆచూకీ తెలుసుకునేందుకు గాలిస్తున్నారు.

missing
missing

By

Published : Aug 24, 2021, 7:55 AM IST

కడప జిల్లా దేవునికడపకు చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవుని కడపకు చెందిన మధుసూదన్ శర్మ అనే పూజారితో కొన్నేళ్ళ క్రితం.. జయలక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల కాలం నుంచి మధుసూదన శర్మ భార్యపై అనుమానం పెంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

నిత్యం మద్యం తాగి.. భార్యను హింసించేవాడు. ఆ బాధలు తట్టుకోలేకే జయలక్ష్మి తన ఇరువురు పిల్లలను తీసుకుని ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుస్తోంది. ఎంత గాలించినా ఫలితం లేక.. జయలక్ష్మి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న చౌకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details