ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భారీ వర్షాలకు కూలిన మిద్దె.. 25 గొర్రెలు మృతి - వర్షాలు

పశువుల పాకపై మిద్దె కూలి పడిన ఘటనలో.. 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మునగలవారిపల్లిలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాక పక్కనే ఉన్న మిద్దె కూలడంతో గొర్రెలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాయి.

sheeps died
25 గొర్రెలు మృతి

By

Published : Jul 22, 2021, 11:35 AM IST

భారీ వర్షాల ధాటికి పాత మిద్దె కూలి పశువుల పాకపై పడటంతో అందులోని 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మునగలవారిపల్లిలో జరిగింది.

గ్రామానికి చెందిన మస్తాన్ తనకున్న గొర్రెల మందను నిన్న రాత్రి పాకలో చేర్చాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పాక పక్కనే ఉన్న ఓ పాత మిద్దె కూలి పడగా... పాకలోని 25 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారమైన గొర్రెల మరణంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని యజమాని మస్తాన్ కోరుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details