MAN KILLED : తీసుకున్న అప్పు చెల్లించాలని అడిగినందుకు ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. కేవలం ఆరు వందల రూపాయల కోసంహత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కోవూరు పట్టణంలోని బాజార్ సెంటర్ సమీపంలో వెల్డింగ్ పని చేసి జీవించే 65ఏళ్ల చాన్ బాషాకు.. ఖాదర్ బాషా 600 రూపాయలు చెల్లించాల్సి ఉంది. డబ్బు ఇవ్వాలని చాన్ బాషా పలుమార్లు ఖాదర్ బాషాను అడిగాడు. అయితే తాజాగా ఈ విషయమై ఇరువురి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఫుల్గా మద్యం తాగొచ్చిన ఖాదర్ బాషా.. చాన్ బాషాపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. గుండెలపై చేతితో ఇష్టానుసారంగా కొట్టడంతో చాన్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అప్పు చెల్లించమన్నందుకు.. ఎంత పని చేశాడంటే.. - moneylender murder
MAN MURDER : సహజంగా ఎవరైనా తీసుకున్న అప్పు తీర్చమని అడిగితే.. ఉంటే ఇవ్వడమో.. లేకపోతే బతిమలాడి కొన్ని రోజుల ఆగమని అడగడమో చేస్తారు. అంతా చేసినా ఒప్పుకోకపోతే బెదిరించడమో.. భయపెట్టడం లాంటివి చేయడానికి కూడా వెనకాడరు. కానీ ఇక్కడ తీసుకున్న డబ్బులు అడిగినందుకు.. అప్పు ఇచ్చిన వ్యక్తిపైనే దాడి చేయడం కాకుండా.. చనిపోయేందుకు కారణమయ్యాడు అప్పు తీసుకున్న వ్యక్తి.
MAN KILLED