ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్​కు వైద్య పరీక్షలు పూర్తి.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు - డ్రైవర్​ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్

MLC ANANTHA BABU
డ్రైవర్​ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్

By

Published : May 23, 2022, 1:13 PM IST

Updated : May 23, 2022, 9:33 PM IST

13:10 May 23

సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు విచారణలో తెలిపిన ఎమ్మెల్సీ అనంత్?

MLC ANANTHA: ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ జీజీహెచ్​లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అంతకు ముందు కాకినాడ ఏఆర్‌ కార్యాలయంలో అనంతబాబును పోలీసులు విచారించారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఈ విచారణ కోసం సుబ్రహ్మణ్యం ఇద్దరు స్నేహితులను పోలీసులు తీసుకెెళ్లారు. హత్య జరిగిన రోజు సుబ్రహ్మణ్యంతో ఉన్న ఇద్దరు స్నేహితులైన.. సుబ్రహ్మణ్యం, పవన్‌ను తమ ఇళ్లకు వచ్చి తీసుకెళ్లారని సుబ్రహ్మణ్యం తల్లి, పవన్‌ చెల్లి తెలిపారు. కాకినాడ ఎస్పీ కార్యాలయం వద్దకు ఆందోళనతో వచ్చిన సుబ్రహ్మణ్యం తల్లీ, పవన్‌ చెల్లి.. వారిద్దరి ఆచూకీ తెలపాలని ప్రాధేయపడ్డారు. అయితే.. ఇద్దరు యువకులూ తమ వద్దే ఉన్నారని పోలీసులు సర్దిచెప్పి పంపించారు.

ఇదీ జరిగింది :డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ....ఈనెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్‌ ఫోన్‌ చేసి ...నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు. మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చారు.

సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు. పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.

పోస్టుమార్టం నిర్వహించే క్రమంలో హైడ్రామా: సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే క్రమంలో హైడ్రామా నడిచింది. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసే వరకు పోస్టుమార్టం నిర్వహించడానికి వీలులేదంటూ కుటుంబ సభ్యులు శనివారం ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. వారు అంగీకారపత్రంపై సంతకం చేస్తే తప్ప...పోస్టుమార్టం నిర్వహణ సాధ్యంకాకపోవడంతో పోలీసులు తీవ్ర హైరానాపడ్డారు. అప్పటికే దళిత సంఘాలు, తెలుగుదేశం శ్రేణులు పెద్దసంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. విషయం చేయిదాటిపోతుందని భావించిన వైకాపా నేతలు రంగంలోకి దిగారు. అపర్ణ తల్లిదండ్రుల ద్వారా సుబ్రహ్మణ్యం కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకుని వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. నాటకీయ పరిణామాల మధ్య వారంతా కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నా....అంగీకారపత్రంపై సంతకం పెట్టేందుకు అంగీకరించలేదు.

పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎట్టకేలకు ఎస్పీ ప్రకటన చేశారు.ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేయడంతోపాటు అనుమానాస్పద కేసును హత్యానేరం కింద మారుస్తామని...అట్రాసిటీ కేసు కూడా పెడతామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించారు.

అదృశ్యమైన ఎమ్మెల్సీ:సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తన పేరు చేర్చడంతో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అదృశ్యమయ్యారు. గన్‌మెన్లకు చెప్పకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పోలీసుల తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు చెలరేగడంతో ఐదు బృందాలు ఎమ్మెల్సీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం ఆయన కాకినాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారన్న సమాచారం మేరకు అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్లగా...అక్కడ ఆయన భార్య, కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుసుకుని వెనుదిరిగారు. ఆయన కాకినాడ, రాజమహేంద్రవరం పరిసరాల్లోనే ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

వైకాపా ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.. ఏం జరిగింది?

ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్​ది హత్యా..? ప్రమాదమా..?

కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 5 లక్షల సాయం

పెళ్లి ఆపాలనుకుంది.. కానీ ప్రాణం పోయింది... !

ఆన్‌లైన్ షాపింగే బెస్ట్ అంటున్న హైదరాబాదీలు

Last Updated : May 23, 2022, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details