STUDENTS DEAD BODIES FOUND : కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపం కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న కామేష్, గుణశేఖర్ శవాలు లభ్యమవ్వగా ఈరోజు బాలు, బాజి, హుస్సేన్ మృతదేహాలను సహయక బృందాలు వెలికితీశాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వాటిని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. చనిపోయిన బిడ్డలను చూసి కుంటుంబసభ్యులు రోధిస్తున్నారు.
అసలేం జరిగిందంటే:కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలో శుక్రవారం సరదగా ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతైయ్యారు. గల్లంతైన విద్యార్థుల ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విజయవాడలోని పటమట దర్శిపేటకు చెందిన మద్దాల బాలు ఇంటర్ రెండో ఏడాది, షేక్ హుస్సేన్ 9వ తరగతి, షేక్ ఖాశిం అలీ 7వ తరగతి, పిన్నింటి శ్రీను 9వ తరగతి, ఇనకొల్లు గుణశేఖర్ 9వ తరగతి చదువుతున్నారు. తోట కామేష్ పదో తరగతి, షేక్ బాజీ 8వ తరగతి చదువుతూ మానేశారు. వీరంతా స్నేహితులు.