ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MINOR RAPE: కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం - కృష్ణా జిల్లా నేర వార్తలు

minor-girl-rape-at-krishna-district
కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం

By

Published : Sep 4, 2021, 9:21 AM IST

Updated : Sep 4, 2021, 4:08 PM IST

09:20 September 04

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు

 కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మండలంలోని చినపాండ్రక గ్రామానికి చెందిన బాలిక మచిలీపట్నంలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు రెండ్రోజుల క్రితం బాలికకు మాయమాటలు చెప్పి.. సమీపంలోని పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి అతని మిత్రులు అంత బాబు, తరుణ్​లు కూడా చావిడికి చేరుకున్నారు. 

 వారు ముగ్గురూ కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే.. నిన్ను చంపేస్తామని బెదిరించారు. అత్యాచారం, భయంతో.. వణికిపోయిన బాలిక అత్యాచార ఘటనను ఎవరికీ చెప్పలేదు. బాలిక నలతగా ఉండటంతో.. తల్లిదండ్రులు ఆరా తీశారు. మహేశ్, అంతబాబు, తరుణ్​లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. వెంటనే తండ్రి స్థానికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావడంతో... ఐపీసీ సెక్షన్ 376 రెడ్ విత్ 34, పోక్సొ చట్టం సెక్షన్ 5(a) రెడ్ విత్ 6 కింద కేసులు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి:Fire accident: రిఫ్రిజిరేటర్‌లో మంటలు చెలరేగి వృద్ధురాలి మృతి

Last Updated : Sep 4, 2021, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details