ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MURDER: జంగారెడ్డిగూడెంలో పాల బూత్ నిర్వాహకుడి హత్య..కారణమేంటి? - west godavari crime news

murder at west godavari
జంగారెడ్డిగూడెంలో పాల బూత్ నిర్వాహకుడి హత్య

By

Published : Sep 18, 2021, 9:42 AM IST

Updated : Sep 18, 2021, 7:43 PM IST

09:35 September 18

పాల బూత్ నిర్వాహకుడి హత్య

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని మునసబువీధిలో  పాలబూతు యజమానిని దారుణంగా హత్య చేశారు. సురేశ్‌ ప్రభును చిరంజీవి అనే వ్యక్తి నరికి చంపాడు. తాను ప్రేమిస్తున్న యువతిని.. సురేశ్‌ ప్రభు ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా.. చిరంజీవి అతనిపై దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ కొబ్బరిబోండాల కత్తితో నరికాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ ప్రభును.. 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని.. విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. హత్య చేసిన చిరంజీవి కోసం.. పోలీసులు గాలిస్తున్నారు. 

ఇదీ చదవండి: 

COUNTING : ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు.. పోలీసుల పటిష్ఠ బందోబస్తు

Last Updated : Sep 18, 2021, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details