హైదరాబాద్, అంబర్‌పేటలోని మక్రమ్ హోటల్ సమీపంలో.. దుండగులు గుర్తు తెలియని ఓ వ్యక్తిని ముఖంపై బండ రాయితో మోది హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ముఖంపై బండరాయితో మోది హత్య - తెలంగాణ వార్తలు
హైదరాబాద్, అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు రాయితో మోది హతమార్చారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
murder in amberpet
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహం పక్కనే ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో.. వివరాలు తెలియడం లేదన్నారు.
ఇదీ చదవండి:కళాశాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. యువకుడు అరెస్ట్