Maoists Killed Suraveedu Ex Sarpanch: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హత్య - telangana
11:58 December 22
ములుగు జిల్లా కె.కొండాపురం మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ హత్య
maoists killed suraveedu ex sarpanch: తెలంగాణ ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ కొర్స రమేశ్‌ను మావోయిస్టులు హత్య చేశారు. డిసెంబర్ 20న రమేశ్‌ను అపహరించుకుపోయిన మావోయిస్టులు హత్య చేశారు. తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు కొత్తపల్లి సమీపంలో రమేశ్ మృతదేహం లభించింది. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నందునే.. రమేశ్‌ను ప్రజాకోర్టులో శిక్షించినట్లు వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ మావోయిస్టుల లేఖ విడుదల చేశారు.
Maoists kidnap Ex sarpanch: సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్‌ను డిసెంబర్ 20 చెర్ల మండలం నుంచి రాత్రి సమయంలో తిరిగి వస్తున్న క్రమంలో.. మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. రమేశ్.. భార్య ఉద్యోగం కారణంగా ఏటూరునాగారంలో నివసిస్తున్నాడు. ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు భార్యకు సమాచారం ఇవ్వగా.. తీవ్ర భయాందోళనతో కన్నీరుమున్నీరుగా విలపించింది. రమేశ్‌కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని మావోయిస్టులను భార్య, పిల్లలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: