AOB ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కోరాపుట్, బదిలిపహాడ్, మల్లెపోదర్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారం మేరకు ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మల్లెపోదర్ గ్రామంలో కూంబింగ్ దళాలను చూసిన మావోయిస్టులు.. కాల్పులు జరపటంతో, పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి మూడు నాటు తుపాకులు,డిటోనేటర్లు, కార్డెక్స్ బండిల్, గంజాయి ప్యాకెట్లు, ఇతర సామగ్రీని స్వాధీనం చేసుకున్నారు..
ఏఓబీ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి - In police firing
AOB : ఒడిశాలోని కోరాపుట్ బదిలిపహాడ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు.. కూంబింగ్ నిర్వహించాయి. మల్లెపోదర్ గ్రామంలో కూంబింగ్ దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరపటంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుప్రాంతంలో కాల్పులు
Last Updated : Nov 12, 2022, 12:49 PM IST