ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

జూదంలో తలెత్తిన వివాదం.. దాడిలో ఓ వ్యక్తి మృతి - attack with knifes in krishna district

Murder: కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన జూదంలో వివాదం తలెత్తి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇరువురు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం దాడికి దారి తీసింది. కత్తులతో, ఇనుప రాడ్లతో మృతినిపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఇంతకీ ఏమైందంటే..

One Man Killed
జూదంలో హత్య

By

Published : Jan 16, 2023, 12:46 PM IST

One Man Killed : కృష్ణా జిల్లా కోడిపందేల బరి వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. కోడి పందేల బరి వద్ద ఏర్పాటు చేసిన జూదంలో.. ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం దాడికి దారి తీసింది. చినుకు చినుక గాలి వానగా మారినట్లు.. ఆ వివాదం కాస్త దాడి వరకు వెళ్లింది. ఈ దాడిలో ఓ వ్యక్తి మరికొంత మందితో కలిసి కత్తులతో, ఇనుపరాడ్లతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా. అతనిని ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి దాడి చేసిన వ్యక్తికి గతంలో వివాదాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో కోడిపందేలు నిర్వహించారు. కోడిపందేలతో పాటు జూదాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ జూదంలో సీతాయిలంక వాసి అనిల్​ అనే వ్యక్తి పాల్గొన్నాడు. అతనితో పాటు గుంటూరు జిల్లా గొరికపర్రుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి కూడా పేకాట ఆడాడు. జూదం ఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. అది కాస్త ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. దీంతో అనిల్​పై నాగరాజు దాడికి దిగాడు. ఇరువురు పరస్పరం ఇనుప రాడ్లతో, కత్తులతో దాడులకు దిగారు. నాగరాజుతో మరికొందరు అనిల్​పై దాడి చేశారు.

ఈ దాడిలో అనిల్​ తీవ్రంగా గాయపడ్డాడు. గాయలపాలైన అనిల్​ను ఘటనాస్థలంలో ఉన్న వారు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అనిల్​ ప్రాణాలు కోల్పోయాడు. అయితే నాగరాజుకు, అనిల్​కు మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.

కోడికత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు మృతి:ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా కోడిపందాల నిర్వహణ ఆగడంలేదు. నిర్వాహకులపై కేసులు పెట్టినా.. కోడిపందాల నిర్వహించే వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు.. పైగా పందేల నిర్వహణలో రాజకీయ నాయకులు ఉండటంతో వారిని ఎదురించేందుకు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సివస్తోంది. మరికొన్ని ప్రదేశాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు... బాహాటంగానే పందేలు నిర్వహిస్తున్నా... వారిపై చర్యలు చేపట్టేందుకు సాహసించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంద‌ర్భంలో కోడిపందాల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా: నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడికత్తి గుచ్చుకుని పద్మరాజు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన నెలకొంది. కోడిపందాలు చూస్తుండగా ఓ కోడి ఎగిరి వచ్చి పద్మరాజు కాలు తెగింది. దాంతో అతనికి తీవ్ర రక్త స్రావమైంది. ఆసుపత్రికి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పద్మరాజు మృతి చెందారు. ఘటనపై నల్లజర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ జిల్లా: కిర్లంపూడి మండలం వేలంకలో కోడిపందాల్లో కోడికి కత్తి కడుతుండగా కత్తి తెగి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు నెలకొంది.కోడి కాలికి కత్తి కడుతుండగా 45 ఏళ్ల సురేష్​కు కోడి కత్తి చేతి మణికట్టు తగిలి నరం తెగి పోయింది. సురేష్​ను ఆటోలో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్త స్రావం కావడంతో సురేష్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details