Man was killed and his head taken away: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డు జావుకుపల్లి దగ్గర మామిడి తోటలో హత్య జరిగింది. హతుడు నిమ్మనపల్లి మండలం గార బురుజుకు చెందిన రమేష్ గా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దుండగులు రమేష్‌ని కిరాతకంగా చంపారు. మొండెం నుంచి తలను వేరుచేసి చేశారు. మెుదట కళ్లలో కారంపొడి చల్లి అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. మొండెం పక్కనే ద్విచక్ర వాహనం పడి ఉంది. హత్య సమాచారం తెలుసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు ఘటన ప్రదేశాన్ని పరిశిలించారు. ఈ హత్య ఆదివారం రాత్రి జరిగినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
హత్య చేశారు.. ఆపై తలను ఎత్తుకెళ్లారు..! - పాత కక్షలతో హత్యలు
Man was killed in annamayya district: ఓ హత్య కేసులో నిందితుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని బెంగళూరు రోడ్డులో జరిగింది. నిందితులు హతుడి మొండెం నుంచి తలను వేరు చేసి హత్య చేశారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటనలో మృతుడి వివరాలు పోలీసులు గుర్తించారు. మృతుడు నిమ్మనపల్లి మండలం గార బురుజుకు చెందిన రమేష్గా గుర్తించారు.
అయితే ఇంతవరకు అతని తల ఆచూకి మాత్రం తెలియలేదు. హతుడు రమేష్ గత మే నెలలో నిమ్మనపల్లి మండలంలో జరిగిన వెంకటరమణ హత్య కేసులో రెండో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి తన ప్రత్యర్థుల నుంచి తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో హత్య జరగడంతో చనిపోయిన వ్యక్తి రమేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.