Murder: సింహాచలం అడివివరం సమీప ప్రాంతమైన శివారు లండగరువులో లండ నాగరాజు (42) మృతి చెందాడు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతనిని 108లో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించి గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని మంచం కోడుతో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా వారు విడిగా ఉంటున్నారు.
మంచం కోడుతో కొట్టి చంపారు.. ఎక్కడంటే? - Simhachalam
Murder: ఓ వ్యక్తిని మంచం కోడుతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన సింహాచలం సమీప ప్రాంతమైన లండగరువులో జరిగింది. దాడిలో తీవ్ర రక్తస్రావమైన లండ నాగరాజు (42) చికిత్స పొందుతూ మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. గత రెండేళ్లుగా వారు విడిగా ఉంటున్నారు.
హత్య