Man tries to Kill His Girlfriend in Hanamkonda: పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గుజ్జేటి వేణు కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ (35) అదే గ్రామానికి చెందిన యువతి (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో అతడు ఆమె మతాన్ని స్వీకరించినట్లు తెలిసింది. పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కొద్దిరోజులుగా గొడవలు పడుతున్నారు.
పెళ్లికి అంగీకరించలేదని ప్రేయసి గొంతు కోసిన యువకుడు - Man tries to Kill His Girlfriend in Hanamkonda
Man tries to Kill His Girlfriend in Hanamkonda: ప్రేయసిని పెళ్లాడటానికి అడ్డొస్తుందని తన మతం మార్చుకున్నాడు ఓ యువకుడు. అయినా ఆ యువతి తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలవుతూ ఉండేవి. మంగళవారం రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడు మరోసారి గొడవపడ్డాడు. క్షణికావేశంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేటలో చోటుచేసుకుంది.
Man tries to Kill His Girlfriend in Hanamkonda
ఇదే విషయంపై శ్రీనివాస్ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి నిలదీశాడు. అంగీకరించకపోవడంతో యువతి గొంతు, చేయి కోసి గాయపరిచాడు. ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు అతడిని చితకబాదారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు గ్రామానికి చేరుకుని యువతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.
ఇవీ చదవండి: