ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వృద్ధురాలిని హతమార్చాడు... ఆపై పశ్చాత్తాపంతో..! - rape attempt on old women at chirala

ప్రకాశం జిల్లా చీరాలలో ఓ వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో.. దారుణంగా దాడి చేసి హతమార్చాడు.

man killed old lady at chirala
man killed old lady at chirala

By

Published : Jun 9, 2021, 9:11 AM IST

Updated : Jun 9, 2021, 11:27 AM IST

తన కోరిక తీర్చనందుకు వృద్ధురాలిపై ఓ వ్యక్తి కిరాతంగా దాడి చేసి హత్య చేశాడు. ఆపై పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోయాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బందావారివీధిలో కర్నాటి విజయలక్ష్మి (61) అనే వృద్ధురాలు.. భర్త మరణంతో కొన్నాళ్లుగా ఒంటరిగా జీవించింది. తులాబంధు సాంబశివరావు అనే వ్యక్తి.. వృద్ధురాలు ఇంటి సమీపంలోనే నివసిస్తున్నారు. వీరు తరచూ చరవాణిలో మాట్లాడుకుంటుండేవారు.

ఈ క్రమంలో.. గత నెల 11వ తేదీ రాత్రి వృద్ధురాలి ఇంటికి సాంబశివరావు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించని కారణంగా.. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం మంచినీళ్లు కావాలని సాంబశివరావు విజయలక్ష్మిని అడిగాడు. ఆమె తెచ్చేందుకు వంట గదిలోకి వెళ్లిన సమయంలో కోపంతో పదే పదే దాడి చేశాడు. తీవ్ర గాయాలతో.. విజయలక్ష్మి స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను హతమార్చాలని సాంబశివరావు నిర్ణయించుకున్నాడు. గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ విషయం గత నెల 15న వెలుగు చూడటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం ఎప్పటికైనా బయటపడుతుందనే భయంతో.. తానే వృద్ధురాలిని అకారణంగా హతమార్చాననే పశ్చాత్తాపంతో సాంబశివరావు తొలుత రెవెన్యూ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. అనంతరం వారు అతన్ని పోలీసులకు అప్పగించినట్లు డీఎస్పీ పి.శ్రీకాంత్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి:

అక్రమార్కుల ధన దాహం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

Last Updated : Jun 9, 2021, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details