ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Selfie Suicide: 'ఈ అమ్మాయి కనిపించేంత మంచిది కాదు సార్​.. నా పిల్లల్ని కాపాడండి' - క్రైం న్యూస్

Selfie Suicide: ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయమై ఆమెకు ఎన్నోసార్లు నచ్చచెప్పాడు. అయినా తీరు మారకపోవడంతో చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Selfie Suicide
Selfie Suicide

By

Published : Nov 13, 2022, 8:13 PM IST

Selfie Suicide: సజావుగా సాగుతున్న ఆ దంపతుల కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మనోవేదనకు గురైన భర్త.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్​లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్​నగర్​ నివాసి అయిన గూడూరు శేఖర్..​ నాగాంజలి అనే మహిళను 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

నాగాంజలి హైదరాబాద్​లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పని చేస్తూ.. ఈ ఏడాది జనవరిలో ఆదిలాబాద్​కు బదిలీ అయింది. అయితే నాగాంజలి హైదరాబాద్​లో పని చేస్తున్న సమయంలో నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్​గా పనిచేస్తున్న స్వరూప్​రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు చనువుగా ఉండటం భర్త శేఖర్ గమనించాడు. అది తప్పు అని.. శేఖర్ ఆమెను మందలించాడు. నాగాంజలి తన తప్పు ఒప్పుకుని.. పెద్దల సమక్షంలో భవిష్యత్తులో అలాంటి తప్పులు పునరావృతం కావని క్షమాపణ కోరింది. ఆ తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది.

ఈ క్రమంలోనే నాగాంజలి మళ్లీ స్వరూప్​రెడ్డితో కలిసి ఆదిలాబాద్​లో సహజీవనం చేస్తోందనే విషయాన్ని భర్త శేఖర్ తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న సెల్ఫీ వీడియో తీసుకుని విషం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని బాధితుడి తండ్రి పోలీసులను కోరారు.

భార్య వివాహేతర సంబంధం.. అవమానం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details