మద్యం విషయంలో భార్యతో గొడవ పడి.. మనస్తాపంతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. తెలంగాణలోని సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ జనతా బస్తీకి చెందిన శ్రీనివాస్(42).. దోబీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, కుమారుడు ప్రతాప్, కుమార్తె వసంత ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల క్రితం ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది.
మద్యం మానేయమన్నందుకు గొడవ.. మనస్తాపంతో ఆత్మహత్య - man suicide by arguing stop drinking news
మద్యం మానేయమని అడిగినందుకు మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![మద్యం మానేయమన్నందుకు గొడవ.. మనస్తాపంతో ఆత్మహత్య LIQUOR FIGHT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:40:44:1620371444-11664860-mana.jpg)
LIQUOR FIGHT
దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ భార్యాపిల్లలతో మాట్లాడటం మానేశాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:ఇవి బాగా తినండి.. కరోనాను దరిచేరనివ్వకండి!