MAN MURDERED HIS OWN BROTHER: కృష్ణాజిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడు ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చిట్టిపోతుల మధుబాబు, విశ్వనాథం అన్నాతమ్ముళ్లు. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు విశ్వనాథం.. అన్నతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటాపెరిగి కొట్టుకునే స్థాయికి చేరారు. అసలే మద్యం మత్తు.. ఆపై కట్టలు తెంచుకున్న కోపంలో సొంత అన్నపైనే రోకలి బండతో దాడి చేశాడు.
MAN MURDERED HIS OWN BROTHER: మద్యం మత్తులో రోకలి బండతో దాడి.. మృతి చెందిన సోదరుడు! - కృష్ణా జిల్లా తాజా నేర వార్తలు
MAN MURDER AT KRISHNA: మద్యం మత్తులో సొంత అన్నతోనే గొడవపడ్డాడు. ఇష్టమొచ్చినట్లుగా దూషించాడు. అది చాలదన్నట్లు రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సోదరుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యం మత్తులో రోకలి బండతో దాడి.. మృతి చెందిన సోదరుడు!
ఈ ఘటనలో మధుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:man attack: యువతిని వేధిస్తున్న యువకుడు... ప్రశ్నించినందుకు..!