ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Murder: చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. నరికి చంపిన అన్న - అనంతపురం జిల్లా తాజా నేర వార్తలు

Man Murder: ఓ వ్యక్తికి మొదటి భార్యతో విభేదాలు ఏర్పడటంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఖాళీగా ఉండటం ఎందుకని వేరే వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్​గా పనిలో చేరాడు. ఆ సమయంలోనే ట్రాక్టర్​ యజమాని​ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తన వద్ద పని చేసే వ్యక్తి.. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో అతి దారుణంగా వేట కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటాంపల్లిలో చోటు చేసుకుంది.

Man Murder
చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని...వ్యక్తిని నరికి చంపిన అన్న

By

Published : Mar 22, 2022, 7:41 AM IST

Updated : Mar 22, 2022, 7:59 AM IST

Man Murder: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని వెంకటాంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుక్కరాయసముద్రం నీలారెడ్డిపల్లికి చెందిన నరేంద్ర (35) ప్రస్తుతం పామిడి మండలం కొనేపల్లిలో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్యతో మనస్పర్థలు ఏర్పడి ఆమెకు దూరంగా ఉంటూ.. వెంకటాంపల్లిలో కుళ్లాయిస్వామి వద్ద ట్రాక్టరు డ్రైవర్​గా పనిలో చేరాడు. రెండేళ్ల కిందట ఆయన చెల్లెలు కుళ్లాయమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంతో వారి కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.

కొన్ని రోజుల తర్వాత నరేంద్ర సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు. అయితే సోమవారం రాత్రి అతనికి చెందిన ట్రాక్టరు వెంకటాంపల్లికి ఇసుక లోడుతో వెళ్లింది. దాని జాకీ పని చేయడం లేదని డ్రైవరు ఫోన్ చేయడంతో ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చిన నరేంద్రను కుళ్లాయిస్వామి, అతని తమ్ముడు కొడవళ్లతో నరికి చంపి.. అక్కడి నుండి పరారయ్యారని సీఐ శేఖర్, ఎస్సై రాఘవేంద్రప్ప తెలిపారు. మృతుడి తండ్రి పోలీస్​సేష్టన్​కు వచ్చి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

మృతుడు నరేంద్ర
Last Updated : Mar 22, 2022, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details