MURDER: భార్య, తల్లిపై కత్తితో దాడి చేసి చంపేశాడు - man killed his wife and mother
ఓ వ్యక్తి తన భార్య, తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం చందు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా ఇరువురిపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన తిరుమలగిరి పీఎస్ పరిధిలోని మిలటరీ క్వార్టర్స్ వద్ద జరిగింది. మృతులు తల్లి కుమారి, భార్య నాగపుష్పగా గుర్తించారు
man killed his wife and mother at Thirumalagiri in secunderabad
సికింద్రాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ క్వార్టర్స్ వద్ద దారుణం జరిగింది. చందు అనే వ్యక్తి తన భార్య నాగపుష్ప, తల్లి కుమారిలపై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు చందును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
- ఇదీ చదవండి :