ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు ఓ యువకుడు. గిఫ్ట్ ఇస్తే జైలుకు వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే..
Lover Revenge: ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్.. అందులో ఏం ఉందంటే? - man gifted a cannabis packet to a girl
ప్రేమను నిరాకరించిన అమ్మాయిలను అదే పనిగా వెంటపడి వేధించే అబ్బాయిల గురించి మనకు తెలుసు. వేధింపులను దాటి.. వారిపై యాసిడ్ దాడులు, నరికి చంపడాలు చూశాం. కానీ తన ప్రేమను నిరాకరించిందని ఆ యువతిని కటకటాల వెనక్కి పంపేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఆమెను జైలుకు పంపేందుకు అతడు పన్నిన కుట్రను చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
విశాఖపట్నానికి చెందిన వినయ్‌కుమార్(25) ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు. తనతోపాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతికి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష తీర్చుకోవాలని కుట్ర పన్నాడు. ఈవెంట్స్ నిర్వాహకురాలు అయిన ఆమె ఆ పనిపై 2018 మే 31న మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి శిర్డీసాయి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఇది తెలుసుకుని వచ్చిన అతడు.. స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ అని నమ్మించి 3 కిలోల గంజాయి ప్యాకెట్ చేతికిచ్చాడు. మరుసటిరోజు రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకునే ముందే.. ఆ యువతి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు జీఆర్పీ వారికి సమాచారం అందించాడు. రైలు స్టేషన్‌కు రాగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడినంటూ.. గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో గంజాయి ఇచ్చి ఆమెను మోసం చేసినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణకొచ్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో ఆ యువతిని వదిలిపెట్టారు.
అదేరోజు వినయ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు చిక్కకుండా అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. కేసేమీ లేదని, కేవలం సమాచారం కోసం మాట్లాడాల్సి ఉందని జీఆర్పీ అధికారులు పిలిపించగా గురువారం స్టేషన్‌కు వచ్చాడు. విచారణలో గంజాయిని గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో ఇచ్చింది తానేనని అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
- ఇదీ చదవండి :