ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ... ఫ్లై ఓవర్ డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాలానగర్ పైవంతెనపై (Balanagar Flyover) చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్... లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్... లైసెన్స్ కోసం తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు.
accident: బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వ్యక్తి మృతి - బాలానగర్ యాక్సిడెంట్ న్యూస్
ఫ్లై ఓవర్ డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. మృతుడు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
![accident: బాలానగర్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వ్యక్తి మృతి a Man died on Balan agar flyover](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12530359-294-12530359-1626874766365.jpg)
balanagar accident
బాలానగర్ ఫ్లైఓవర్‌పై వ్యక్తి మృతి
బాలానగర్‌పై వంతెనపై వేగంగా వెళ్తు ఎడమవైపు ఉన్న సేఫ్టీ డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన అశోక్‌ను... స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తాలుకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. పైవంతెన ప్రారంభమయ్యాక జరిగిన మొదటి ప్రమాదం ఇదే.