Man died falling into canal: అనంతపురం శివారు తపోవనం సమీపంలో హెచ్ఎల్సీ కాలువలో పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తి బోయ వినోద్కుమార్గా గుర్తించారు.
Man died falling into canal: కాలువలో పడి వ్యక్తి మృతి - తపోవనంలో కాలువలో పడి మృతి
Man died falling into canal: అనంతపురం శివారులోని హెచ్ఎల్సీ కాలువలో ఓ మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడా.. లేక మద్యం మత్తులో పడిపోయాడా.. ఇంకెవరైనా పడేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తాళం వేసి బయటకు వెళుతున్నారా..? అయితే మీ ఇంట్లో చోరీ జరిగినట్లే..!