ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Brutal Murder: పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. కత్తిపోట్లతో నగ్నంగా.. - naked dead body found in oldcity

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య(Brutal Murder at Hyderabad)కు గురయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య

By

Published : Sep 21, 2021, 2:42 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో ఓ వ్యక్తి దారుణ హత్య(Brutal Murder at Hyderabad)కు గురయ్యాడు. అతణ్ని హత్య చేసి దుండగులు నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు శరీరంపై దుస్తులు లేని స్థితిలో మృతదేహాన్నిగమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి మృతదేహంపై కత్తిపోట్లు ఉండటం గమనించారు. అతడు ఏ ప్రాంతానికి చెందినవాడో, ఎవరు హతమార్చి ఉంటారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details