Murder: ధర్మవరంలో రౌడీ షీటర్ దారుణ హత్య - dharmavaram latest news
17:33 September 24
అనంతపురం జిల్లా (anantapur district) ధర్మవరంలో దారుణం జరిగింది. దామోదర్ రెడ్డి అనే రౌడీషీటర్‌ను స్థానిక యువకులు వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు(Rowdy sheeter brutally murdered). అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
అనంతపురం జిల్లా(anantapur district) ధర్మవరం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీ వద్ద... పట్టపగలే దామోదర్ రెడ్డి అనే రౌడీ షీటర్‌ను స్థానిక యువకులు దారుణంగా హతమార్చారు(Rowdy sheeter brutally murdered). రాజా అనే యువకుడితో పాటు మరో ఏడుగురు వేటకొడవళ్లతో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురం గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి కొన్నేళ్లుగా.. ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ పురంలో నివాసముంటున్నాడు. స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న దామోదర్ రెడ్డిపై ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. కొంతకాలంగా స్థానిక యువకులను బెదిరింపులకు గురి చేస్తుండటంతో పాటు.. ఇతర వడ్డీ వ్యాపారులతోనూ విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాంతో ఎనిమిది మంది యువకులు దామోదర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారని... పథకం ప్రకారం చెట్టు కింద కూర్చున్న దామోదర్ రెడ్డిపై మొదట కారం పొడి చల్లి.. అనంతరం వేట కొడవళ్లతో నరికి చంపారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు ధర్మవరం పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి