ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

గుంటూరులో దారుణం.. కత్తులతో వేటాడి వ్యక్తి హత్య - brutally murdere in ap

Man brutally murdered: గుంటూరులో వ్యక్తి హత్య కలకలం రేపింది. ప్రశాంతంగా ఉండే గుంటూరు నగరంలో కత్తులతో దాడి చేయడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణరక్షణ కోసం పరిగెడుతున్న ఆ వ్యక్తిని.. వెంటాడి మరీ చంపారు. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Man brutally murdered
గుంటూరులో వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు

By

Published : Oct 18, 2022, 10:46 PM IST

Updated : Oct 18, 2022, 10:57 PM IST

Ramesh was killed in Etukuru Centre: గుంటూరులోని లాలాపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. ఏటుకూరు సెంటర్‌లోని ఓ దుకాణం వద్ద నిల్చుని ఉన్న రమేశ్‌ అనే వ్యక్తిపై.. దుండగులు కత్తులతో దాడిచేశారు. ప్రాణరక్షణ కోసం దుకాణంలోకి వెళ్లి దాక్కునేందుకు రమేశ్‌ ప్రయత్నించగా, ఆగంతుకులు వెంటాడి మరీ చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రమేశ్‌ హత్యకు గురయ్యారని తెలిసి భార్య, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.

తన భర్త హత్యకు ముగ్గురు కారణమంటూ రమేశ్‌ భార్య లత ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే మార్కెట్‌ సెంటర్‌ వద్ద రమేశ్‌ హత్య కలకలం రేపింది. గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమేశ్‌ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నా భర్త హత్యకు ముగ్గురు కారణం: మృతుడి భార్య లత


ఇవీ చదవండి:

Last Updated : Oct 18, 2022, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details