LOVER SUICIDE: ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడమే లేక వారి ప్రాణాలే తీసుకోవడమో చేస్తోంది నేటి యువత. తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని తెలిసి.. వివాహం జరుగుతున్న కల్యాణ మండపం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించాడో యువకుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ వద్ద చోటుచేసుకుంది.
నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన షేక్ అశ్వక్(19) అదే ప్రాంతానికి చెందిన ఫాతిమా(19)ను ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న అశ్వక్ ఆ పెళ్లిని ఆపడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. అన్ని ప్లాన్‌లు విఫలమవ్వడంతో తన ప్రియురాలి పెళ్లి జరుగుతున్న కల్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు.