Maoist Dump in AOB: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పంచాయతీ పరిధిలోని నడిమెంజరీ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టుల డంప్ లభించింది. ఐఈడీ బాంబులతో సహా పెద్దసంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టుబడినట్లు మల్కన్‌గిరి ఎస్పీ నితీష్ సోదాని వెల్లడించారు.
ఐఈడీ బాంబులతో సహా పెద్దసంఖ్యలో పట్టుబడిన ఆయుధ సామగ్రి పంచాయతీ ఎన్నికల వేళ..
ఒడిశాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో మల్కన్‌గిరి పోలీసులు కటాఫ్ ఏరియాలో విసృత్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ డంప్‌లో దేశవాళీ తుపాకీ, ఐదుకేజీల టిఫిన్ బాంబు, ప్రెషర్ ఐఈడీ, మూడు తుప్పుపట్టిన దేశవాళీ తుపాకీలు, ఒక రివాల్వర్, డిటోనేటర్లు, వాకీ టాకీ, 42 మీటర్లు కోడెక్స్ వైర్‌తో బాటు మైన్స్ తయారీకి ఉపయోగించే పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, బ్యానర్లు, తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
రష్మికతో పెళ్లి.. బూతులతో రెచ్చిపోయిన విజయ్‌దేవరకొండ!