ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తిరుపతి రోడ్డుప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

tirupati accident
tirupati accident

By

Published : Jan 25, 2023, 1:28 PM IST

Updated : Jan 25, 2023, 7:19 PM IST

13:25 January 25

చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కల్వర్టును ఢీకొన్న కారు

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

ROAD ACCIDENT IN TIRUPATI : వాళ్లంతా స్నేహితులు. దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుని కాణిపాకం వెళుతూ.. రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. మహారాష్ట్రలోని సోలాపూర్​కు చెందిన కొందరు యువకులు తిరుమల దైవ దర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి కాణిపాకం వెళ్తుండగా.. ​పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కల్రోడ్డుపల్లి వద్ద కల్వర్టును ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరు ఆస్పత్రిలో మరొకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అంతర్ ఆనంత్ తెంబుకర్, మయూర్ మట్టన్, రిషికేష్ జంగం, అజయ్ నంగనాద్​లుగా గుర్తించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 25, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details