కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం అపహరణకు గురైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి శివారు సుంకరపాలెం గ్రామానికి చెందిన మహిళ శిశువును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మచిలీపట్నం డీఎస్పీ మాసూం బాషా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
శిశువు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు..తల్లిదండ్రులకు అప్పగింత
11:31 September 26
నిన్న మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి అపహరణ
జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ వెల్లడించిన వివరాల మేరకు..
కృతివెన్ను మండలం మునిపెడ శివారు సుంకరపాలెం గ్రామానికి చెందిన మందపాటి మేరి అనే మహిళ.. జిల్లా ఆసుపత్రిలో సంచరించింది. ఐదు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రిలోనే ఆడపిల్లకు జన్మనిచ్చిన పెద మద్దాలికి చెందిన సింధూజతో పరిచయం పెంచుకుని ఆమె బిడ్డను అపహరించుకుపోయింది.
శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు అందుకున్న వెంటనే శిశువు ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు 12 ప్రత్యేక బృందాలగా విడిపోయారు. అనుమానిత మహిళ సీసీ ఫుటేజీని జిల్లాలోని పోలీసు సిబ్బందికి పంపారు. అది చూసిన కృతివెన్ను పోలీస్‌స్టేషన్ పరిధిలో పనిచేసే శిరీష అనే మహిళా పోలీస్.. అనుమానితురాలిని గుర్తించారు. దీంతో బిడ్డ ఆచూకీ లభ్యమైంది.
ఇదీ చూడండి:TRAINS CANCELLATION: గులాబ్ తుపాన్ ప్రభావంతో రైళ్ల రద్దు