Suicide Attempt: ఓ వివాహిత.. ప్రియుడితో కలిసి విషం తాగిన ఘటన తెలంగాణ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వివాహిత (32) జిల్లాకు చెందిన యువకుడి (22)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ పెళ్లికి అడ్డంకులు వస్తాయని వారు అటవీ ప్రాంతానికి చేరుకుని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.
Suicide Attempt: ప్రియుడితో కలిసి విషం తాగిన వివాహిత.. పరిస్థితి విషమం
Suicide Attempt: ఆ మహిళకు పిల్లలు ఉన్నారు. కానీ మరో యువకుడితో పరిచయం హద్దులు దాటింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం వారిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు.. కట్టు దాటారు. తమ పెళ్లికి అడ్డంకులు వస్తాయని అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన తెలంగా వికారాబాద్ జిల్లాలో జరిగింది.
suicide
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే చికిత్స నిమిత్తం వికారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఒకేచోట పని చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: