Lovers Suicide: విశాఖ నగరంలో ప్రేమికుల జంట ఆత్మహత్య కలకలం రేపింది. మెడలో తాళి కట్టిన మరుక్షణమే వారిద్దరు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు, దూసి ప్రాంతాలకు చెందిన దామోదర్ (19), అతని మరదలు వరసయ్యే 17 ఏళ్ల బాలిక ఇవాళ మధ్యాహ్నం బస్సులో విశాఖ చేరుకున్నారు. వీరిద్దరూ దాదాపు తెలిసిన కుటుంబాలకు చెందినవారే. సోమవారం సాయంత్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లలపాలెం రామాలయం సమీపంలోని అయాన్ రెసిడెన్సీలో బసకు దిగారు... కలిసి ఫోటోలు దిగారు. ఆమె మెడలో దామోదర్ అప్పుడే కట్టినట్టుగా తాళి కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం వారు బసకు దిగిన రూం నుంచి కొద్దిగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి తలుపులు తెరిచి చూసేసరికి ఇద్దరూ శవాలై కనిపించారు. తాడుతో ఉరేసుకున్నట్టు గుర్తించారు. దీంతో స్థానికంగా ఉంటున్న వారి బంధువులు విషయం తెలుసుకుని హోటల్ వద్దకు వచ్చారు.
విశాఖలో ప్రేమికుల ఆత్మహత్య.. అసలేం జరిగింది..! - లాడ్జిలో ప్రేమికుల ఆత్మహత్య
Lovers Suicide: నిండు నూరేళ్లు బతకాల్సినవాళ్లు.. ఉరేసుకుని తనువు చాలించారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి విశాఖలోని ఓ లాడ్డిలో ప్రాణాలు తీసుకున్నారు. అయితే బావమరదలైన వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని.. పెద్దలకు చెప్పే ధైర్యం లేక ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
suicide
ఇటీవలే వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, అంతకుమించి తమకేమీ తెలియదని బంధువులంటున్నారు. ప్రేమికుల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. టూటౌన్ ఇన్‌చార్జి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చంద్రశేఖర్, విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇవీ చదవండి: