LOVERS SUICIDE :తెలంగాణలోని నల్గొండ జిల్లా హాలియా వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సాగర్ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాలువలో దూకిన యువతీ యువకులను కాపాడేందుకు తాడును తీసుకువచ్చారు. తాడు సాయంతో యువతిని కాపాడారు.
సాగర్ కాలువలోకి దూకిన ప్రేమజంట.. యువతిని రక్షించిన స్థానికులు - lovers suicide in haliya
LOVERS SUICIDE : తెలంగాణలోని నల్గొండ జిల్లా హాలియా వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సాగర్ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
సాగర్ కాలువలోకి దూకిన ప్రేమజంట
యువకుణ్ని కాపాడేలోగా.. అతను నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడి కోసం ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ప్రేమికులు పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.