ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పెళ్లైన తర్వాత బయటపడిన అన్నాచెల్లి బంధం.. ఆ తర్వాత - భద్రాద్రిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ఎన్నో ఆశలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. పది రోజుల్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పెళ్లి అనంతరం యువకుడి కులం తెలిసి.. తనకు సోదరుడి వరుస అవుతాడని.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Suicide Attempt
Suicide Attempt

By

Published : Sep 21, 2021, 2:46 PM IST

Updated : Sep 21, 2021, 4:18 PM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కొన్ని రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. ఆత్మహత్యకు యత్నించారు. యువతి మృతి చెందగా.. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెహ్రూ నగర్​తండాకు చెందిన బొడ శ్వేత(21), కట్టుగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేశ్​(24) పది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి అనంతరం యువకుడి కులం తెలిసి.. తనకు సోదరుడి వరుస అవుతాడని.. మనస్తాపంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేశ్​ కూడా పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

తమ బిడ్డను మోసం చేసి పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశాడని.. యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

కట్టుగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్​.. తన కులం పేరు మార్చి చెప్పి.. ప్రేమ పేరుతో మోసం చేసి మా అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత అన్న వరుస అవుతాడని తెలిసి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మాకు న్యాయం జరగాలి. -మృతురాలి బంధువు .

ఇదీ చూడండి:

విజయవాడ శివారులో అపస్మారక స్థితిలో యువకుడు..ఏం జరిగింది!

Last Updated : Sep 21, 2021, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details