తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తెట్టేకుంట గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం తెట్టేకుంట గ్రామానికి చెందిన మిట్టపల్లి కొండల్(22), సంధ్య(19) పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ఇవాళ ఉదయం మృతి చెందారు.
ప్రియురాలికి పెళ్లి నిశ్చయం..
వీరిద్దరూ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతికి ప్రేమించిన వ్యక్తిని కాదని వేరొకరితో వివాహం నిశ్చయించారు. మనస్తాపం చెందిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు(Lovers Suicide news) యత్నించారు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం మృతి చెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎదిగిన కుమారుడు, పెళ్లీడుకు వచ్చిన కుమార్తె మరణంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఇదీ చదవండి:CASH SEIZED: పంచలింగాల చెక్పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..ఎంతంటే..!