ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ప్రేమికురాలితో పెళ్లి కోసం సినిమా స్టైల్లో ట్రై చేశాడు, కానీ ఏం జరిగిందంటే - lover threatened to suicide for marriage

Lover Suicide Warning తాను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినిమాల్లో బెదిరించినట్టు చేస్తే అంతా సెట్​ అవుతుందనుకున్నాడు ఓ ప్రేమికుడు. బిల్డింగ్​ ఎక్కి కాసేపు హంగామా చేశాడు. అతను అనుకున్నట్టు జరుగుతుందనుకున్నాడు. కాకపోతే సీన్​ రివర్స్​ అయ్యింది.

1
1

By

Published : Aug 20, 2022, 10:39 PM IST

Lover Suicide Warning: అమ్మాయి ప్రేమను ఒప్పుకోకపోతే.. ప్రేమించిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ పెళ్లికి ఒప్పుకోకపోతే.. కొన్ని సినిమాల్లో బిల్డింగులెక్కి దూకేస్తామని బెదిరిస్తుంటారు. నానా హంగామా తర్వాత ఆ సన్నివేశానికి ఓ హ్యాపీ ఎండింగో.. కామెడీ ముగింపో.. దర్శకుడు రాసుకున్నట్టు జరిగిపోతుంది. అయితే.. అలాంటి సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని సినిమా స్టైల్లో ట్రై చేశాడో యువకుడు. అయితే.. ఇక్కడ తాను అనుకున్నది జరగకపోగా మరొకటి జరిగింది. ఈ సన్నివేశానికి తెలంగాణలోని హైదరాబాద్‌ బషీర్​బాగ్‌ పోలీస్​స్టేషన్ పరిధిలోని దూలపల్లి వేదికైంది.

ప్రేమించిన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయాలంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఆంజనేయులు.. ఓ ఎత్తైన బిల్డింగ్​ ఎక్కాడు. లేకపోతే.. అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తన డిమాండ్​ను అమ్మాయి బంధువులు, అక్కడున్న స్థానికులతో పాటు 100కు కూడా కాల్​ చేసి చెప్పాడు. యువకుడి హంగామా చూసి స్థానికులందరు కాసేపు భయభ్రాంతులకు లోనయ్యారు.

కొంతమంది స్థానికులు, కుటుంబసభ్యులు.. యువకుడున్న చోటుకు చేరుకుని అక్కడే చితకబాదారు. అనంతరం కిందికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఆంజనేయులును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఠాణాకు తరలించి కుటుంబసభ్యుల ముందే కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం చేస్తే.. చట్టరీత్యా శిక్షిస్తామని హెచ్చరించి పంపించారు.

ప్రేమికురాలితో పెళ్లి కోసం సినిమా స్టైల్లో ట్రై చేశాడు, కానీ జరిగింది వేరు

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details