Lover suicide: ప్రేమించిన యువతికి దక్కలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. వివాహ వేదిక వద్దనే ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన పాతబస్తీలోని లంగర్‌హౌజ్‌లో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
ప్రేయసికి మరొకరితో పెళ్లి.. వేదిక వద్దనే కిరోసిన్ పోసుకుని బలవన్మరణం - lungerhouse in hyderabad
Lover suicide: ఒక్కసారి ప్రేమిస్తే చాలు ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకాడరు. నా అనుకున్న వారు దక్కకపోతే ఆ బాధను తట్టుకోలేరు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటోందని తెలిసి ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు ఓ యువకుడు. వివాహ వేదిక వద్దనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాజేంద్రనగర్ వాసి అయిన షేక్ ఆశ్వక్(19).. అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని (19) ప్రేమించాడు. కానీ జూన్ 30వ తేదీ రాత్రి 11 గంటలకు లంగర్ హౌస్ రింగ్ రోడ్ వద్ద ఉన్న మొగల్ ఫంక్షన్ హాల్లో అమ్మాయికి వేరే వారితో పెళ్లి జరుగుతోందన్న విషయం అశ్వక్‌కు తెలిసింది. దీంతో వెంటనే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని ఒంటిపైన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశ్వక్ ఇవాళ ఉదయం మృతి చెందాడు.
ఇవీ చదవండి: