Nanakramguda Cylinder Blast: అందరు హాయిగా నిద్రపోతున్న సమయంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నానక్‌రామ్‌గూడాలోని హనుమాన్ దేవాలయం దగ్గర్లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి (Cylinder Blast) ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయ చర్యలు అందించారు.
cylinder blast today video: గ్యాస్ సిలిండర్ పేలుడు.. 11 మందికి గాయాలు - పేలుడు దృశ్యాలు
హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడ ఓ ఇంట్లో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న 11 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గ్యాస్ సిలిండర్ పేలుడు.. 11 మందికి గాయాలు
క్షతగాత్రుల్లో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన తొమ్మిది మందిని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఇదీ చూడండి:gas leak: ఇంట్లో గ్యాస్ లీకై... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి