LORRY: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులోని జాతీయ రహదారి పక్కనున్న సత్యం కళ్యాణ మండపంలోకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆదివారం రాత్రి ఉరవకొండ వైపు నుంచి వస్తున్న కంటైనర్ టైర్ పంచరై.. అక్కడే ఉన్న డివైడర్ పైనుంచి కళ్యాణమండపంలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా.. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాలు, కళ్యాణ మండపం గోడ ధ్వంసమైంది. కళ్యాణమండపం యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
LORRY: ఉరవకొండ శివారులో కంటైనర్ బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
LORRY: ఇద్దరు వ్యక్తులు ఫంక్షన్ హాలులో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. తేరుకుని చూసేసరికి ఓ వాహనం తమవైపు దూసుకొస్తోంది. అంతే ఒక్క ఉదుటున పరుగులు తీశారు. అయితే ప్రహారీ గోడ అడ్డు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉరవకొండ శివారులో జరగగా.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
![LORRY: ఉరవకొండ శివారులో కంటైనర్ బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం LORRY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15300957-591-15300957-1652701882626.jpg)
కళ్యాణ మండపంలోకి దూసుకెళ్లిన లారీ.
కళ్యాణ మండపంలోకి దూసుకెళ్లిన లారీ